అవి ఈడీ నోటీసులు కావు.. మోదీ నోటీసులు: ఎన్డీటీవీతో కవిత
- లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటీసులు
- ఈడీ సమన్స్ కు, మోదీ సమన్స్ కు తేడా లేదన్న కవిత
- తన తండ్రి కేసీఆర్ ను బీజేపీ టార్గెట్ చేసిందని ఆరోపణ
ఇండియాలో మోదీ సమన్స్ కు, ఈడీ సమన్స్ కు తేడా లేదని కవిత అన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు ఉన్నా మోదీ కంటే ముందు ఈడీ వస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజాకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్లడమే విపక్షాలు చేయాల్సిన పని అని అన్నారు. తెలంగాణలో వరుసగా మూడోసారి అధికారంలోకి రాబోతున్న తన తండ్రిని బీజేపీ టార్గెట్ చేసిందని విమర్శించారు. తప్పు చేసిన వారు భయపడతారని... తాను తప్పు చేయలేదని అన్నారు. మరోవైపు చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాసేపట్లో కవిత దీక్షను ప్రారంభించబోతున్నారు.