ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి ఎంఆర్ శామ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
- ఎంఆర్ శామ్ క్షిపణిని పరీక్షించిన భారత నేవీ
- నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించిన వైనం
- యాంటీ షిప్ మిస్సైళ్ల అంతు చూసే ఎంఆర్ శామ్
- ఇజ్రాయెల్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన డీఆర్డీవో
ఎంఆర్ శామ్ క్షిపణి... 70 కిలోమీటర్ల రేంజిలో శత్రుదేశాల యుద్ధ విమానాలను, అటాకింగ్ హెలికాప్టర్లను, క్రూయిజ్ మిస్సైళ్లను, బాంబర్ డ్రోన్లను ఇది తుత్తునియలు చేయగలదు. ఈ అత్యాధునిక క్షిపణిని డీఆర్డీవో, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేయగా, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది.