Narendra Modi: మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందన

ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడైన సంగతి తెలిసిందే. నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో బీజేపీ కూటములనే విజయం వరించింది. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మేఘాలయలో సంకీర్ణం ఏర్పడనుండగా, బీజేపీ కీలకపాత్ర పోషించనుంది. 

ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ సభలో మోదీ మాట్లాడుతూ.... ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎంతో ప్రేమను చూపించారని కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. విజయం కంటే ప్రజలు చూపించే ప్రేమ ఎంతో సంతోషాన్నిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో ఉన్న దృఢమైన విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని వివరించారు. 

ఈశాన్య రాష్ట్రాలు ఢిల్లీకి దూరంగా ఉండొచ్చేమో కానీ, తన హృదయానికి మాత్రం దగ్గరగానే ఉంటాయని మోదీ వ్యాఖ్యానించారు. ఇక, ఓటమిని తట్టుకోలేని కొందరు ఈవీఎంలను తప్పుబడుతున్నారని విమర్శించారు.
Narendra Modi
Nagaland
Tripura
Meghalaya
Election Results

More Telugu News