మంచు మనోజ్, మౌనికల పెళ్లి సందడి ప్రారంభం

Manchu Manoj and Bhuma Mounika Reddy marriage
  • నిన్న వేడుకగా జరిగిన మెహందీ ఫంక్షన్
  • ఈరోజు జరగనున్న సంగీత్ కార్యక్రమం
  • రేపు మంచు లక్ష్మి ఇంట్లో పెళ్లి వేడుక
సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన రెండో కుమారుడు, హీరో మంచు మనోజ్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాడు. దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికారెడ్డిని పెళ్లాడబోతున్నాడు. వీరి వివాహం రేపు జరగనుంది. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ నివాసంలో పెళ్లి వేడుక జరగనుంది. పెళ్లిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిన్న మెహందీ వేడుకతో పెళ్లి సందడి మొదలయింది.

ఈరోజు సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మరోవైపు మంచు మనోజ్, మౌనికారెడ్డి ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరి తొలి వైవాహిక జీవితాలు ముగిసిపోయాయి. చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. వీరి కొత్త జీవితం సంతోషకరంగా ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Advertisement
Manchu Manoj
Bhuma Mounika Reddy
Marriage
Tollywood

More Telugu News