ఫోర్జరీ కేసులో అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
- నీటిపారుదలశాఖ అధికారి సంతకాలను ఫోర్జరీ చేశారంటూ కేసు
- కేసు విచారణపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
- విచారణ జరిపేందుకు అనుమతించిన సుప్రీంకోర్టు
హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు... ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఫోర్జరీ సెక్షన్ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని ఉత్తర్వులను జారీ చేసింది. సెక్షన్ 41 సీఆర్పీసీ ప్రకారం విచారణ కొనసాగాలని ఆదేశించింది.