చివరి నిమిషంలో మంత్రి హరీశ్ రావు పర్యటన రద్దు!
- మంత్రి హరిశ్ రావు పర్యటన కోసం బోథ్ ఎమ్మెల్యే విస్తృత ఏర్పాట్లు
- చివరి నిమిషంలో మంత్రి పర్యటన రద్దు
- పార్టీలో అంతర్గత విభేదాలే పర్యటన రద్దుకు కారణమని నియోజకవర్గంలో టాక్
పర్యటన రద్దుకు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలే కారణమన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గంలోని పార్టీ సీనియర్లు బాపూరావును వ్యతిరేకిస్తున్నారట. ఆయనకు టిక్కెట్‌కు రాదనీ ప్రచారం చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే హరీశ్ పర్యటన రద్దు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఒత్తిడి వల్లే పర్యటన రద్దయి ఉండొచ్చని స్థానికంగా ఓ వ్యాఖ్య వినిపిస్తోంది.