కిషన్ రెడ్డిని మెచ్చుకున్న ప్రధాని మోదీ
- కిషన్ రెడ్డి చేపట్టిన ‘హెల్తీ బేబీ షో’ కార్యక్రమం అద్భుతం అని కితాబు
- సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ‘హెల్తీ బేబీ షో’ నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి
- ఆరోగ్యంగా ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు సన్మానం
- ప్రోటీన్ కిట్ అందజేస్తున్న కేంద్ర మంత్రి
ఈ కార్యక్రమం గురించి కిషన్ రెడ్డి వివరిస్తూ.. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి కాలనీ, ప్రతి బస్తీ, ప్రతి హౌజింగ్ సొసైటీ లోనూ ‘హెల్తీ బేబీ షో’కు సంబంధించిన దరఖాస్తు ఫామ్ లను పంచినట్టు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు సన్మానం చేయడంతోపాటు వారికి సర్టిఫికెట్లు అందజేశామన్నారు. అలాగే వారికి ‘పోషణ్ కిట్లు’ ఇచ్చి చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలిస్తామంటూ వారితో ప్రతిజ్ఞ చేయించామన్నారు. వారికి ఇచ్చిన కిట్లలో ప్రొటీన్ పౌడర్, ప్రొటీన్ బిస్కట్లు, నెయ్యి, ఖర్జూరాలతోపాటు డైపర్లు, ఫొటో ఫ్రేమ్, బొమ్మ కూడా ఉన్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు.