రోజుకు 36 వేలు ఇస్తామన్నా ఒక్కరూ చేరట్లేదు.. ఈ ఉద్యోగం ఏంటంటే..!
- ఆఫ్షోర్ రిగ్స్లో ఉద్యోగాలకు చమురు సంస్థ ప్రకటన
- రోజుకు 36 వేల వేతనం ఇస్తామని వెల్లడి
- ఉద్యోగంలో చేరేవారి కోసం నెలరోజులుగా వేచి చూస్తున్న సంస్థ
సముద్రం అడుగున భూమిపొరల్లోని చమురును వెలికితీసేందుకు ఉద్దేశించిన భారీ నిర్మాణాలను ఆఫ్షోర్ రిగ్స్ అంటారు. చమురును వెలికితీసి, నిల్వచేసేందుకు ఆఫ్షోర్ రిగ్స్లో అన్ని ఏర్పాట్లూ ఉంటాయి. ఇక సంస్థలో చేరే వారు ఏడాదికి గరిష్ఠంగా ఆరు నెలల పాటు రిగ్స్లోనే పనిచేయాలి. కంపెనీ ప్రకటన ప్రకారం.. ఉద్యోగుల ఒక్కో షిఫ్ట్ 12 గంటలపాటు ఉంటుంది. ఉద్యోగుల ప్రారంభ వేతనమే నెలకు రూ.4 లక్షలు (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే). ఉద్యోగులకు ఓ హాలిడే ట్రిప్ ఖర్చంతా సంస్థే భరిస్తుంది. ఇందులో ఎవరైనా రెండేళ్ల పాటు పనిచేయగలిగితే ఏకంగా కోటి రూపాయలు మూటగట్టుకుని ఇంటికి పోవచ్చు. మొత్తం ఐదు ఖాళీలు ఉన్నాయని సంస్థ పేర్కొంది. అయినా సంస్థ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని సమాచారం.