రేపటి నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు.. రోజువారీ విశేషాలు
- ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు విశేష పూజలు
- ఆలయ పునర్నిర్మాణం తర్వాత మొదటిసారి
- సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం, పరిసరాలు
- తిరు కల్యాణోత్సవం రోజు ఆలయానికి సీఎం కేసీఆర్
మొదటి రోజు స్వస్తీవాచనం, రక్షాబంధనం నిర్వహిస్తారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహణ జరుగుతుంది. బ్రహ్మోత్సవాలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అలంకరణ కోసం మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన వ్యాపారవేత్త పట్టువస్త్రాలను సమర్పించారు. తిరు కల్యాణోత్సవం రోజు సీఎం కేసీఆర్ స్వామిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు అందజేస్తారు.
బ్రహ్మోత్సవాలలో రోజువారీ విశేషాలు..
- ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహణ
- 22న ఉదయం 8 గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు భేరీ పూజ, దేవతాహ్వానహవనం.
- 23 న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకారం. 9 గంటలకు మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణం, రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ.
- 24న ఉదయం 9 గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ.
- 25న ఉదయం శ్రీకృష్ణాలంకార సేవ రాత్రి 7 గంటలకు పొన్న వాహన సేవ.
- 26న ఉదయం గోవర్దన గిరిధారి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు సింహ వాహన అలంకార సేవ.
- 27న ఉదయం జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, అనంతరం శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం.
- 28 న ఉదయం శ్రీరామ అలంకార సేవ, రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం.
- మార్చి 1న ఉదయం 9 గంటలకు గరుడ వాహన సేవ, రాత్రి 7గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం.
- మార్చి 2న ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన.
- 3న ఉదయం 10 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవం.