Chandrababu: ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు.. చంద్రబాబు పర్యటనపై ఉండవల్లి కామెంట్

చంద్రబాబు పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించడం చివరకు వైసీపీకే మైనస్ అవుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తాజాగా పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వరకూ అనేక మంది పాదయాత్రలను తాను చూశానన్నారు. అయితే.. ఇటీవల చంద్రబాబును అడ్డుకున్న తీరు గతంలో ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయని వ్యాఖ్యానించిన ఉండవల్లి.. జగన్‌ను కాంగ్రెస్ జైలుకు పంపడంతోనే ఆయన సీఎం అయ్యారని గుర్తు చేశారు. 

తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనకు అనుమతుల అంశం ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ముందురోజునే సభకు అనుమతిచ్చి.. ఆ తరువాత వెంటనే అనుమతి లేదంటూ అరాచకం సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు చిత్ర విచిత్ర వ్యూహాలు పన్నారన్నారు. నిరసనకారుల తరహాలో ఖాకీ దుస్తులతో పోలీసులే రోడ్డుపై బైఠాయించడం ఏంటని నిప్పులు చెరిగారు. ఇకపై పోలీసులకు సహకరించబోమని..సహాయ నిరాకరణ ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు.
Chandrababu
Vundavalli Arun Kumar

More Telugu News