వందో టెస్టులో పుజారా డకౌట్.. 66/4తో కష్టాల్లో పడ్డ భారత్
- 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు
- రాహుల్, రోహిత్, పుజారా, శ్రేయస్ ఔట్
- చెలరేగిపోతున్న ఆసీస్ స్పిన్నర్ నేథన్ లైయన్
క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాపైనే ఆశలున్నాయి. భారత్ కోల్పోయిన వికెట్లన్నీ ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నేథన్ లైయన్ ఖాతాలో పడ్డాయి. కాగా, తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖవాజ (81), పీటర్ హ్యాండ్స్ కోంబ్ (72 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు వికెట్లు పడగొట్టగా..జడేజా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీశారు.