Rani Durgavati Vishwavidyalaya: మధ్యప్రదేశ్ లో యూనివర్సిటీపై బాంబు దాడి.. వీడియో వైరల్!

Man hurls bombs outside Rani Durgavati Vishwavidyalaya in Jabalpur
షార్ట్స్‌లో చూడండి
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ప్రభుత్వ యూనివర్సిటీ క్యాంపస్ పై బాంబు దాడి జరిగింది. ముసుగు ధరించిన ఓ వ్యక్తి రెండు నాటు బాంబులు విసిరాడు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం గేటు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి వరుసగా రెండు బాంబులు విసిరాడు. దీంతో ఆ ప్రాంతంలో పొగ కమ్ముకుంది. అక్కడున్న వాళ్లు అతడిని పట్టుకునేందుకు పరిగెత్తగా.. దుండగుడు బైక్ పై పరారయ్యాడు. క్యాంటీన్ బయట ఈ దాడి జరిగిందని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. 

మరోవైపు ఈ ప్రాంతంలో పేలని రెండు బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ‘‘యూనివర్సిటీలోని క్యాంటీన్ బయట గుర్తుతెలియని వ్యక్తి బాంబులు విసిరినట్లు మాకు సమాచారం వచ్చింది. ఎవరికీ ఏమీ కాలేదు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం’’ అని స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రమేశ్ కౌరవ్ చెప్పారు.
Go Back to Shorts
Rani Durgavati Vishwavidyalaya
Man hurls bombs
Jabalpur
BOMB

More Telugu News