ఐసీసీపై భారత అభిమానుల ఆగ్రహం.. కారణం ఇదే!

16-02-2023 Thu 11:12 | Sports
Advertisement
  • టెస్టుల్లో భారత్ నంబర్ వన్ అని ప్రకటించిన ఐసీసీ
  • అన్ని ఫార్మాట్లలో మన జట్టుదే అగ్రస్థానం అని మురిసిపోయిన ఫ్యాన్స్
  • కొన్ని గంటలకే భారత్ రెండో ర్యాంక్ లోనే ఉందని వెల్లడి
  • ఐసీసీ సాంకేతిక తప్పిదంపై పలువురి అసహనం
Advertisement
ప్రపంచ క్రికెట్‌ పాలనా వ్యవహారాలు చూసే అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) తప్పులో కాలేసింది. టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానం సాధించిందన్న ఆనందాన్ని ఐసీసీ ఆవిరి చేసింది. టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకును దక్కించుకొని, భారత జట్టు అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానం సాధించిందని అభిమానులు సంబరాలు చేసుకోగా ఐసీసీ ఒక్కసారిగా వాటిని నీరుగార్చింది. 

నిన్న ప్రకటించిన టెస్ట్‌ క్రికెట్‌ తాజా ర్యాంకింగ్స్‌లో భారత్‌ నం.1 ర్యాంక్ కు చేరిందని వెల్లడించింది. తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్‌ 132 పరుగులతో రోహిత్‌ సేన ఘన విజయం సాధించడంతో కంగారూలను వెనక్కు నెట్టిందని తెలిపింది. ఇప్పటికే టీ20, వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరడంతో టెస్ట్‌ల్లోనూ టాప్‌తో మూడు ఫార్మాట్లలో మన జట్టే టాప్ అంటూ అంతా ఉప్పొంగిపోయారు. బీసీసీఐ కార్యదర్శి జై షా భారత జట్టును అభినందిస్తూ ట్వీట్ చేశారు. 

పలువురు కేంద్ర మంత్రులు కూడా అభినందనలు తెలిపారు. కానీ సాయంత్రానికి ఈ ఉత్సాహం అంతా నీరుగారింది. సాంకేతిక తప్పిదంతో ర్యాంకింగ్స్‌ లెక్కల్లో తేడా వచ్చినట్టు గుర్తించిన ఐసీసీ 126 పాయింట్లతో ఆసీస్‌ జట్టే టాప్‌ ర్యాంక్‌లో ఉందని పేర్కొంది. 115 పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో నిలిచిందని వెల్లడించింది. దాంతో అంతా డీలాపడిపోయారు. తన ట్వీట్ ను జై షా డిలీట్ చేశారు. 

మరోవైపు ఐసీసీపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ క్రికెట్ పాలనను చూసే ఐసీసీ ర్యాంకింగ్స్ విషయంలో ఇలా తప్పులో కాలేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. కాగా, శుక్రవారం మొదలయ్యే రెండో టెస్టులో ఆస్ట్రేలియాను ఓడిస్తే భారత్ టెస్టుల్లోనూ టాప్ ర్యాంక్ సాధించి అన్ని ఫార్మాట్లలోనూ నంబర్ వన్ టీమ్ అవుతుంది.
Advertisement
Team Indiaicctestrankingsconfuson

More Telugu News

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55
..more