స్వదేశానికి రామంటున్న భారత ఖైదీలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్వదేశానికి రామంటున్న భారత ఖైదీలు

విదేశీ గడ్డపై నేరం చేసి జైల్లో ఊచలు లెక్కిస్తున్న భారతీయ ఖైదీలను స్వదేశానికి పంపుతామంటే ఎగిరి గంతేస్తారు. ఎంతైనా స్వదేశం కదా! కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కొందరు భారత ఖైదీలు మాత్రం స్వదేశానికి రావడానికి ఎంతమాత్రం ఇష్టపడడం లేదు. యూఏఈకి, భారత్ కు మధ్య ఖైదీల అప్పగింత ఒప్పందం ఉంది. అయితే, మహిళల అక్రమ రవాణా, మహిళలతో బలవంతపు వ్యభిచారం తదితర కేసులలో యూఏఈలో జైలుశిక్ష అనుభవిస్తున్న భారత ఖైదీలు స్వదేశానికి రావడాన్ని అవమానంగా భావిస్తున్నారు. భారత్ కు వెళితే తలెత్తుకోలేమని, తమ వారికి ముఖం చూపించుకోలేమని భావిస్తున్నట్లు అక్కడి ప్రముఖ పత్రిక ఒకటి పేర్కొంది. హత్యకేసులో శిక్షను అనుభవిస్తున్న 200 మంది భారత ఖైదీలు స్వదేశానికి రావడానికి సుముఖంగా ఉన్నారట.

More Telugu News