న్యూజిలాండ్‌పై గెలుపుతో వన్డేల్లో నంబర్ 1 స్థానానికి భారత్!
- కివీస్‌తో చివరి వన్డేలో 90 పరుగుల తేడాతో భారత్ విజయం
- ఈ గెలుపుతో 114 పాయింట్లతో వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా భారత్
- 111 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయిన కివీస్
ఇండోర్ వన్డేలో భారత్ విజయం సాధించిన తర్వాత ఈ స్థానాలు తారుమారయ్యాయి. భారత్ 114 స్థానాలతో అగ్రస్థానానికి చేరుకోగా, 113 స్థానాలతో ఇంగ్లండ్ రెండో స్థానానికి పడిపోయింది. 112 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానానికి పరిమితం కాగా, రెండు పాయింట్లు కోల్పోయిన కివీస్ నాలుగో స్థానానికి దిగజారింది.
త్వరలోనే ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ సిరీస్‌లో కనుక ఇంగ్లిష్ జట్టు 3-0తో వైట్ వాష్ చేస్తే తిరిగి టాప్ ప్లేస్‌కి చేరుకుంటుంది. కాగా, టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా 267 రేటింగ్ పాయింట్లతో ఇప్పటికే అగ్రస్థానంలో ఉంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో మాత్రం 115 పాయింట్లోతో రెండో స్థానంలో ఉంది. 126 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.