వాషింగ్టన్ పోస్ట్ ను విక్రయించనున్న జెఫ్ బెజోస్?
- ఫుట్ బాల్ జట్టు వాషింగ్టన్ కమాండర్స్ ను కొనుగోలు చేసే యోచనలో బెజోస్ ఉన్నట్టు వార్తలు
- 2013లో వాషింగ్టన్ పోస్ట్ ను సొంతం చేసుకున్న బెజోస్
- అమ్మకం వార్తలను ఖండించిన బెజోస్ ప్రతినిధి
2013లో 250 మిలియన్ అమెరికన్ డాలర్లకు వాషింగ్టన్ పోస్ట్ ను బెజోస్ సొంతం చేసుకున్నారు. ఇటీవల బెజోస్ ఓ సందర్భంలో మాట్లాడుతూ, న్యూస్ పేపర్ ను సొంతం చేసుకోవడం తన లక్ష్యం కాదని వ్యాఖ్యానించడం గమనార్హం. తనకు ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. అయితే ఏదైనా జాతీయ ఫుట్ బాల్ జట్టును సొంతం చేసుకోవాలనే విషయంపై మాత్రం ఆయన బహిరంగంగా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో, ఆయన వాషింగ్టన్ పోస్ట్ ను అమ్ముతారా? లేదా? అనే విషయంపై రానున్న రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది.