'అంతం' ఆడితే 'సత్య' సినిమా తీసేవాడినే కాదు: వర్మ
- కెరియర్ ఆరంభంలో వరుస హిట్స్ ఇచ్చిన వర్మ
- మాఫియా సినిమాల స్పెషలిస్ట్ గా క్రేజ్
- 'అంతం' ఫ్లాప్ గురించిన ప్రస్తావన
- అదే కథను 'సత్య'గా తీశానని వెల్లడి
తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "ఒక సినిమా హిట్ .. ఫ్లాప్ .. వరస్ట్ అనే విషయాలను వసూళ్లను బట్టి నేను లెక్కించను. ఆ సినిమా తీసే సమయంలో నా దగ్గరున్న సోర్స్ ఏమిటి? ఎంతవరకూ వాటిని ఉపయోగించుకోగలిగాను అనేదే చూసుకుంటాను" అన్నారు.
" నా కెరియర్లో నేను చెడగొట్టిన కథ ఏదైనా ఉందీ అంటే అది 'అంతం' మాత్రమే. కాకపోతే బాలీవుడ్ లో నేను నిలదొక్కుకోవడానికి కారణం 'అంతం' సినిమానే. ఆ సినిమా ఫ్లాప్ అయింది కనుకనే, మళ్లీ నేను దానిని 'సత్య' సినిమాగా తీశాను. సేమ్ స్టోరీని తీస్తే ఆడేసింది. అదే 'అంతం' ఆడితే 'సత్య'ను తీసేవాడిని కాదు" అంటూ చెప్పుకొచ్చారు.