ఫుట్ బాల్ ఉద్ధండులను బాలీవుడ్ దిగ్గజం కలిసిన వేళ.. వీడియో ఇదిగో!

Ronaldo and Messi meet Amitabh Bachchan ahead of PSG vs Saudi All Star XI match
  • రొనాల్డో, మెస్సీ, ఎంబాపేలతో బిగ్ బీ కరచాలనం
  • రియాద్ లో స్పెషల్ మ్యాచ్ ను ప్రారంభించిన అమితాబ్
  • పీఎస్ జీ, రియాద్ సీజన్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్
ఫుట్ బాల్ లో ఉద్ధండులుగా పేరొందిన ఆటగాళ్లను బాలీవుడ్ దిగ్గజం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కలిసిన అరుదైన సందర్భం గురువారం చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలో ఈ నెల 19న జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ లో రియాద్ సీజన్, పారిస్ సెయింట్ జెర్మెయిన్ (పీఎస్ జీ) తలపడ్డాయి. ఈ మ్యాచ్ కు బిగ్ బీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లతో అమితాబ్ బచ్చన్ కరచాలనం చేశారు. ఈ మ్యాచ్ లో రియాద్ సీజన్ తరఫున పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో, పీఎస్ జీ తరఫున అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ తలపడ్డారు. ఈ మ్యాచ్ లో 5-4 తేడాతో పారిస్ సెయింట్-జెర్మెయిన్ విజయం సాధించింది.

బ్రెజిల్ స్టార్ ఆటగాడు నెయ్ మార్, ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపె కూడా ఈ మ్యాచ్ లో తలపడ్డారు. అయితే, అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన మెస్సీని కలిసినప్పుడు, పోర్చుగల్ స్టార్ రొనాల్డోను కలిసినప్పుడు అమితాబ్ కాస్త ఎక్కువసేపు షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించారు. ఫుట్‌బాల్ కు వీరాభిమాని అయిన అమితాబ్.. ఈ ప్రత్యేక సందర్భాన్ని తన ట్విట్టర్ అకౌంట్లోనూ షేర్ చేసుకున్నాడు. "రియాద్ లో ఓ సాయంత్రం.. ఇదో అద్భుతమైన సాయంత్రం.. క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ, ఎంబాపె, నెయ్‌మార్ కలిసి ఆడటం, గెస్ట్ గా ఈ మ్యాచ్ ను ప్రారంభించడం.. పీఎస్‌జీ వర్సెస్ రియాద్ సీజన్స్ అద్భుతం" అని బిగ్ బీ ట్వీట్ చేశాడు.
Go Back to Shorts
messi
ronaldo
Amitabh Bachchan
psg
riyad
embape
Neymar
football match
Saudi Arabia

More Telugu News