20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
- వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 80 సీట్లలో విజయం సాధిస్తుందన్న ఎర్రబెల్లి
- 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే ఆ సంఖ్య 100కు పెరుగుతుందన్న మంత్రి
- కాంగ్రెస్ గరిష్ఠంగా 25, బీజేపీ 20 స్థానాలు గెలుచుకుంటాయని జోస్యం
అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గరిష్ఠంగా 25 స్థానాలు, బీజేపీ 20 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ మాత్రం 80 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న 15-20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే ఆ సంఖ్య 100కు పెరుగుతుందని అన్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఆరేడు జిల్లాల్లోను, బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మూడు నాలుగు జిల్లాల్లో మాత్రమే పోటీ ఉంటుందని, మిగతా చోట్ల బీఆర్ఎస్కు పోటీ లేదని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు.