ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య.. ఆపై సెప్టిక్ ట్యాంకులో పూడ్చివేత!
- యూపీలోని బులంద్ షహర్ నుంచి రెండేళ్ల క్రితం నోయిడా వచ్చిన బాధితుడి కుటుంబం
- తాపీమేస్త్రీతో హతుడి భార్య వివాహేతర సంబంధం
- భర్త ఉంటే ఆటలు సాగవని ప్రియుడితో కలిసి హత్య
ఈ నెల 2న మద్యం మత్తులో ఉన్న భర్తను ప్రియుడి సాయంతో గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి పక్కనే నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడేసి పూడ్చేసి ప్లాస్టరింగ్ చేశారు. తన సోదరుడు సతీశ్ జాడ లేకపోవడంతో అతడి సోదరుడు ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నీతూను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె సమాధానాలు అనుమానాస్పదంగా ఉండడంతో గట్టిగా ప్రశ్నించడంతో హత్య విషయం వెలుగు చూసింది. దీంతో నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు.