Vijay Devarakonda: జెర్సీ ఫేం శివ దర్శకత్వంలో పోలీసు పాత్రలో విజయ్ దేవరకొండ

అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ అగ్రహీరోగా మారాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి చిత్రంతో అతని స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. కానీ, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దర్శకుడు, సహ నిర్మాత పూరి జగన్నాథ్ కు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం ఫెయిల్యూర్ కారణంగా పూరి–విజయ్ కాంబినేషన్ లో వస్తున్న జనగణమన (జేజేఎం) నిలిచిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఈ సమయంలో విజయ్ మరో కొత్త చిత్రం ప్రకటనతో అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. జెర్సీ చిత్రంతో నాని కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అందించిన గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ చిత్రం చేస్తున్నట్టు ప్రకటించాడు. 

ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌-శ్రీకర స్టూడియోస్‌ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో విజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడు. ‘నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పేందుకు.. నేను ఎక్కడున్నానో నాకు తెలియదు.. అనామక గూఢచారి’ అంటూ కాన్సెప్ట్‌ పోస్టర్‌ను షేర్ చేసింది చిత్ర బృందం. దీన్ని షేర్ చేసిన విజయ్.. ఇది తన తదుపరి చిత్రం అని ప్రకటించాడు. ‘ఈ స్ర్కిప్ట్ విన్నప్పుడు.. నా గుండె కొన్నిసార్లు కొట్టుకోవడం ఆపేసింది’ అని విజయ్‌ ట్వీట్‌ చేశాడు. ఈ చిత్రంలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం విజయ్.. శివనిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు.
Vijay Devarakonda
12th movie
jersey
new movie
police

More Telugu News