ఉప్పల్ స్టేడియంలో నాలుగేళ్ల తర్వాత వన్డే మ్యాచ్.. ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాలు
- ఈ నెల 18న భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్
- 13వ తేదీ నుంచి ఆన్ లైన్లో టికెట్ల అమ్మకాలు
- పేటీఎంలో మాత్రమే టికెట్ల అమ్మకాలు ఉంటాయన్న అజారుద్దీన్
ఆన్ లైన్ లో పేటీఎంలో మాత్రమే టికెట్లను విక్రయిస్తామని తెలిపారు. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఈ నెల 15 నుంచి 18 వరకు ఉదయం 10 నుంచి 3 గంటల వరకు ఫిజికల్ టికెట్లను తీసుకోవాలని చెప్పారు. జనవరి 14న న్యూజిలాండ్ జట్టు, 16వ తేదీన భారత జట్టు హైదరాబాద్ కు వస్తాయని తెలిపారు. న్యూజిలాండ్ జట్టు 15వ తేదీన ప్రాక్టీస్ చేస్తుందని... 17న ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటాయని చెప్పారు.