కశ్మీర్ లో లోయలో పడి ముగ్గురు సైనికుల మృతి
- చనిపోయిన వాళ్లలో ఒక జేసీవో, ఇద్దరు జవాన్లు
- మృతదేహాలను వెలికి తీసిన అధికారులు
- మంచు పెళ్లలు విరిగిపడడంతో ప్రమాదం
దీంతో పట్టుతప్పి వాళ్లు ముగ్గురూ లోయలో పడిపోయారని చెప్పారు. వారికోసం గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు దొరికాయని చీనార్ కోర్ కు చెందిన అధికారులు వివరించారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన సైనికులు, అధికారి ఎవరనే వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, పూర్తి వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.