నారా లోకేశ్ తో నందమూరి తారకరత్న సమావేశం

Nandamuri Tarakaratna met Nara Lokesh in Hyderabad
  • లోకేశ్ నివాసానికి వచ్చిన తారకరత్న
  • కుటుంబ, రాజకీయ అంశాలపై చర్చ
  • వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై తారకరత్న ఆసక్తి!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఆయన నివాసంలో నందమూరి తారకరత్న మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబపరమైన అంశాలతో పాటు రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు. తారకరత్న గతంలో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. అప్పుడప్పుడు అగ్రనేతలకు మద్దతుగా తన గళం వినిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో, ఆయన వచ్చే ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. 

ఇవాళ లోకేశ్ తో సమావేశంలోనూ తారకరత్న పోటీ చేసే నియోజకవర్గం అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి నందమూరి కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని కూడా లోకేశ్ తో తారకరత్న చెప్పినట్టు సమాచారం.
Go Back to Shorts
Nandamuri Tarakaratna
Nara Lokesh
TDP
Andhra Pradesh

More Telugu News