ఎంపీ రఘురామ పిటిషన్ పై ఏపీ హోంశాఖకు హైకోర్టు కీలక ఆదేశాలు
- తనపై ఉన్న కేసుల వివరాలు తెలపాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ
- ఎంపీపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లు, రిజిస్టర్ కాని ఫిర్యాదుల వివరాలు ఇవ్వాలని హోం శాఖకు కోర్టు ఆదేశం
- తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసిన న్యాయమూర్తి
ఆయన తరఫున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున హోం శాఖ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, నియోజకవర్గానికి వచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా, రఘురామపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఉమేష్ చంద్ర హైకోర్టుకు తెలిపారు. ఉమేష్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. రఘురామకృష్ణపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లు, రిజిస్టర్ కాకుండా ఉన్న వివరాలు కూడా వెంటనే అందించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 19కి వాయిదా వేశారు.