ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. హాజరుకానున్న కేసీఆర్!
- ప్రగతి భవన్లో కేసీఆర్తో భేటీ అయిన తోట చంద్రశేఖర్
- పార్టీ విస్తరణకు సంబంధించిన అంశాలపై చర్చ
- ఆవిర్భావ సభ ఎక్కడ నిర్వహించేదీ త్వరలోనే ప్రకటన
- మండల, జిల్లా కమిటీలకు రూపకల్పన చేయాలని కేసీఆర్ సూచన
నిన్న హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కేసీఆర్తో పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్థసారథి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ విస్తరణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అలాగే, ఏపీలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. సభ ఎక్కడ? ఎప్పుడు? నిర్వహిస్తారన్న విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు. అలాగే, ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీలకు రూపకల్పన చేయాలని, పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచించారు.