ప్రజా సమస్యల కంటే పార్టీ సమస్యలు పెద్దవి కాదు: రేవంత్ రెడ్డి
- అధిష్ఠానం ఏది ఆదేశిస్తే తాను అదే చేస్తానన్న రేవంత్
- పోలవరం ప్రాజెక్టుపై కేసీఆర్ స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్
- కేసీఆర్ కు స్వప్రయోజనాలే ముఖ్యమని విమర్శ
ఏపీకి వెళతానంటున్న కేసీఆర్ పోలవరం ప్రాజెక్టుపై తన స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ పై కేసీఆర్ ఎటువైపు ఉంటారని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో కేసీఆర్ ఏ రాష్ట్రానికి అనుకూలంగా ఉంటారని అడిగారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజల సంక్షేమం ముఖ్యం కాదని, ఆయనకు స్వప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. ప్రజాసంక్షేమం పట్టని కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు.