పెద్దూరులో ఇంటింటికీ చంద్రబాబు పాదయాత్ర
- చంద్రబాబు కుప్పం షోను అడ్డుకున్న పోలీసులు
- పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం
- జగన్ ఇంటికి పోవడం ఖాయమన్న బాబు
మరోవైపు ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంచాలని.. జగన్ నియంతృత్వ ధోరణిని, ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఎన్నికల తర్వాత జగన్ ఇంటికి పోతాడని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. సభలు, ర్యాలీలను నిర్వహించకుండా ఏ చట్టం ప్రకారం జీవో1ని తెచ్చారో చెప్పాలని చంద్రబాబు అడిగారు. ఇది ప్రజలు, ప్రజాస్వామ్యం గొంతుకను నొక్కడమేనని... ఇలాంటివాటిని సాగనివ్వబోనని అన్నారు. తన రోడ్డు షోలపై ఏ చట్టం కింద పోలీసులు అభ్యంతరం చెపుతున్నారని ప్రశ్నించారు.