నా దుస్తులు విప్పించారు: బెంగళూరు ఎయిర్ పోర్టులో దారుణంపై మహిళ ఆవేదన
- ఎయిర్ పోర్టులో తనిఖీల సందర్భంగా దారుణం
- మహిళ చొక్కాను విప్పించిన సెక్యూరిటీ సిబ్బంది
- మండిపడుతున్న నెటిజెన్లు
భద్రతా తనిఖీల సమయంలో తన చొక్కాను తొలగించాలని అడిగారని ఆమె చెప్పారు. ఆ దారుణ పరిస్థితుల్లో తాను లోదుస్తులతో నిలుచున్నానని అన్నారు. ఇది తనకు చాలా అవమానకరమని చెప్పారు. బట్టలను తొలగించమని ఒక మహిళను ఎలా అడుగుతారని ప్రశ్నించారు. బాధితురాలు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెక్యూరిటీ సిబ్బంది నిర్వాకాన్ని నెటిజెన్లు తప్పుపడుతున్నారు.