చంద్రబాబు కుప్పం పర్యటనపై ఉత్కంఠ!
- నేటి నుంచి మూడు రోజుల పర్యటన ప్లాన్ చేసిన బాబు
- రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో
- బాబు పర్యటనను అడ్డుకుంటే ఆందోళన చేస్తామంటున్న టీడీపీ శ్రేణులు
ఈ నేపథ్యంలో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు తలపెట్టిన పర్యటన సాఫీగా సాగుతుందా? ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతాయా? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు రోడ్‌షో, సభలకు వెళ్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తునారు. స్థానిక ఎమ్మెల్యేగా కుప్పంలో ఎక్కడైనా.. సభలు నిర్వహించే హక్కు చంద్రబాబుకు ఉందని చెబుతున్నారు. చంద్రబాబు సభను టీడీపీ నేతలు జరిపి తీరుతామంటున్నారు. తమను అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.