నువ్వు ఉక్కు మహిళవి.. విజయం నీ జన్మహక్కు: సమంతకు ఫొటో పంపిన రాహుల్ రవీంద్రన్
- సమంతను యోధురాలిగా అభివర్ణించిన రాహుల్ రవీంద్రన్
- త్వరలోనే నీ దారి ప్రకాశిస్తుందన్న నటుడు
- రాహుల్ పంపిన ఫొటోను షేర్ చేసిన సమంత
- కఠినమైన పోరాటాలు చేస్తున్న వారికి ఇది అంకితమన్న సమంత
రాహుల్ నుంచి అందుకున్న ఫొటోను సమంత ట్విట్టర్లో షేర్ చేస్తూ.. కఠినమైన పోరాటాలు చేస్తున్న వారికి ఇది అంకితమని, పోరాడుతూనే ఉంటే గతంలో కంటే బలంగా తయారవుతారని రాసుకొచ్చింది. కాగా, సమంత నటించిన యశోద సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే పూర్తయిన ఈ సినిమాకు నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. అలాగే, విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటిస్తోంది.