యాత్ర ఆపాలా..? ఏదైనా విమానాశ్రయానికి వెళ్లి చూడండి.. : కేంద్రమంత్రికి కాంగ్రెస్ కౌంటర్
- విమానాశ్రయాల్లో మాస్క్ పెట్టుకోవాలని అడగడం లేదన్న కాంగ్రెస్ నేత పవన్ ఖెరా
- పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేసుకున్నారా? అని ప్రశ్న
- రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్రకే ఎందుకు నిబంధనలంటూ నిలదీత
కేవలం రాహుల్ గాంధీకి లేఖ రాయడం అంటే, ఆయన్ని, భారత్ జోడో యాత్రను టార్గెట్ చేసుకోవడమేనని పవన్ ఖెరా అన్నారు. ‘‘భారత్ జోడో యాత్రకు ఎంతో ఆదరణ లభిస్తుండడం, ప్రజలు భారీగా పాల్గొంటుండడం చూస్తున్నాం. కానీ, అసలు కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయా? ఏ విమానాశ్రయానికి అయినా వెళ్లి చూడండి. మాస్క్ ధరించాలని ఎవరూ అడగరు. ఎందుకని ప్రజా రవాణాలో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయడం లేదు? రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ కు, భారత్ జోడో యాత్రకు ఈ నిబంధనలు ఎందుకు? పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసుకున్నారా?’’ అని పవన్ ఖెరా ప్రశ్నించారు.