ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు.. ట్విట్టర్లో మోదీ శుభాకాంక్షలు

pm modi wishes to ap cm jagan on his birthday
  • కేంద్రమంత్రులతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్
  • రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, వైసీపీ కార్యకర్తల సంబరాలు
  • నియోజకవర్గాల్లో రక్త దాన, అన్నదాన శిబిరాల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ ద్వారా జగన్ ను విష్ చేశారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ట్వీట్ చేశారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఏపీ సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సీఎం బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుతూ నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, అన్నదాన కార్యక్రమాలు, స్కూలు విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు.
Go Back to Shorts
ap cm
YS Jagan
pm modi
jagan birthday
YSRCP

More Telugu News