గుడివాడ క్యాసినో వ్యవహారం... ఐటీ అధికారులకు ఆధారాలు సమర్పించిన వర్ల రామయ్య

Varla Ramaiah submits Gudivada casino evidences to IT dept
  • గుడివాడలో క్యాసినో
  • కొడాలి నాని, వంశీ నిర్వహించారంటున్న టీడీపీ నేతలు
  • ఆధారాలు ఉంటే ఇవ్వాలన్న ఐటీ శాఖ
  • ఇటీవల వర్ల రామయ్యకు నోటీసులు
  • నేడు ఐటీ కార్యాలయానికి వెళ్లిన వర్ల
గుడివాడలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో క్యాసినో నిర్వహించారంటూ టీడీపీ నేతలు గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనిపై ఐటీ శాఖ ఇటీవల స్పందిస్తూ, టీడీపీ నేత వర్ల రామయ్యకు నోటీసులు పంపింది. వర్ల రామయ్య వద్ద ఉన్న ఆధారాలను ఈ నెల 19న తమకు అందజేయాలని నోటీసుల్లో పేర్కొంది. 

ఈ నేపథ్యంలో, వర్ల రామయ్య నేడు విజయవాడలోని ఐటీ కార్యాలయానికి వెళ్లారు. గుడివాడ క్యాసినోకు సంబంధించిన తన వద్ద ఉన్న వీడియోలు, ఇతర ఆధారాలను ఐటీ అధికారులకు సమర్పించారు. వర్ల రామయ్య వెంట టీడీపీ సీనియర్ నేతలు బోండా ఉమ, కొనకళ్ల నారాయణ, రావి వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు. 

ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ, సత్వరమే విచారణ పూర్తిచేస్తామని ఐటీ అధికారులు చెప్పారని వెల్లడించారు. క్యాసినోకు గోవా నుంచి డ్యాన్సర్లను తీసుకొచ్చినట్టు పక్కా ఆధారాలు ఉన్నాయని అన్నారు.
Go Back to Shorts
Varla Ramaiah
Gudivada Casino
IT Dept
TDP
Vijayawada

More Telugu News