రేపు సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర... హాజరుకానున్న పవన్ కల్యాణ్
- ఏపీలో కౌలు రైతుల ఆత్మహత్యలు
- రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందిస్తున్న జనసేన
- సత్తెనపల్లిలో పవన్ కల్యాణ్ సభ
- పార్టీలో చేరికలు ఉంటాయంటూ ప్రచారం!
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 200 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. వీరి కుటుంబాలకు సత్తెనపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో ఆర్థికసాయం చెక్కులు అందించనున్నారు. సత్తెనపల్లి మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం అని తెలిసిందే. అయితే, ఈ నియోజకవర్గం నుంచి పలువురు నేతలు జనసేనలో చేరతారంటూ కథనాలు వస్తున్నాయి. రేపటి పవన్ సభలోనే ఈ చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.