అత్యంత శక్తిమంతమైన దేశంగా మారాలనుకోవడం లేదు.. ఇతర దేశాల భూభాగం మాకొద్దు: రాజ్ నాథ్ సింగ్
- ప్రపంచ సంక్షేమం కోసం పని చేయాలన్నదే తమ లక్ష్యమన్న రాజ్ నాథ్
- మన సైనిక బలగాల ధైర్య, సాహసాలు ప్రశంసనీయమని కితాబు
- అవాస్తవాలను ప్రచారం చేస్తూ రాజకీయాలు చేయడం సరికాదని వ్యాఖ్య
గాల్వాన్ అయినా, తవాంగ్ అయినా మన సైనిక బలగాలు శౌర్యపరాక్రమాలను నిరూపించుకుంటున్నాయని చెప్పారు. వారు ప్రదర్శిస్తున్న ధైర్య, సాహసాలు ప్రశంసనీయమని కొనియాడారు. వారిని ఎంత ప్రశంసించినా తక్కువేనని చెప్పారు. ప్రతిపక్షాల ఉద్దేశాలు ఏమిటో తాము ఎప్పుడూ ప్రశ్నించలేదని, వారి విధానాలనే ప్రశ్నిస్తున్నామని అన్నారు. వాస్తవాల ఆధారంగా ఎవరైనా మాట్లాడాలని... అవాస్తవాలను ప్రచారం చేస్తూ రాజకీయాలు చేయడం సరికాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్ష విమర్శలు గుప్పించారు.