లక్కీ ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ భామ అషు రెడ్డి

Ashu Reddy gets heroine chance
  • అరవింద్ కృష్ణ హీరోగా 'ఏ మాస్టర్ పీస్' సినిమా
  • ఈ చిత్రంలో హీరోయిన్ గా అషు ఎంపిక 
  • 2018లో చివరి సారిగా వెండి తెరపై కనిపించిన అషు
బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా మెరిసే అవకాశాన్ని కొట్టేసింది. టాలీవుడ్ యువ నటుడు అరవింద్ కృష్ణ ఇటీవలే కొత్త సినిమాను ప్రకటించాడు. 'ఏ మాస్టర్ పీస్' టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా అషు రెడ్డిని సెలెక్ట్ చేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

ఈ చిత్రాన్ని కండ్రగుల శ్రీకాంత్ నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టైటిల్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 2018లో అషు రెడ్డి చివరిసారి వెండి తెరపై కనిపించింది. నితిన్, మేఘా ఆకాశ్ కాంబినేషన్లో వచ్చిన 'ఛల్ మోహనరంగ' సినిమాలో ఆమె ఓ పాత్రలో కనిపించింది. ఇప్పుడు హీరోయిన్ పాత్రకు ఎంపికయిందనే వార్తతో ఆమె అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
Go Back to Shorts
Ashu Reddy
Bigg Boss
Tollywood
A Master Piece Movie

More Telugu News