కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం... కోళ్లు, బాతులను చంపేయాలంటూ ఆదేశించిన ప్రభుత్వం!
- కొట్టాయం జిల్లాలోని రెండు పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ పంజా
- 8 వేల పెంపుడు పక్షులను చంపేయనున్న అధికారులు
- కోళ్లు, మాంసం అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతులపై నిషేధం
ప్రభావిత ప్రాంతాల నుంచి కోళ్లు, బాతులు, మాంసం అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించారు. చనిపోయిన పక్షుల నమూనాలను భోపాల్ లోని నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపించారు. బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను తినడం వల్ల జబ్బు మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వలస పక్షులు, సముద్ర పక్షుల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది.