బెంగళూరు డ్రగ్స్ కేసు రీఓపెన్ చేస్తే రోహిత్ రెడ్డి పాత్ర బయటపడుతుంది: బండి సంజయ్

  • రోహిత్ రెడ్డిని టార్గెట్ చేసిన బండి సంజయ్
  • బెంగళూరు డ్రగ్స్ కేసులో అతడి పాత్ర ఉందని ఆరోపణ
  • రోహిత్ రెడ్డికి కర్ణాటక సర్కారు నుంచి నోటీసు వచ్చిందని వెల్లడి
ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రముఖంగా వినిపించిన పేరు... పైలెట్ రోహిత్ రెడ్డి. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగళూరు డ్రగ్స్ కేసు రీఓపెన్ చేస్తే రోహిత్ రెడ్డి పాత్ర బయటపడుతుందని అన్నారు. రోహిత్ రెడ్డికి ఈ డ్రగ్స్ కేసులో కర్ణాటక ప్రభుత్వం నుంచి నోటీసు కూడా వచ్చిందని వెల్లడించారు. 

బెంగళూరు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి పాత్ర ఉందని, దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు తమ లీగల్ టీమ్ బెంగళూరు వెళ్లిందని తెలిపారు. 

అయితే, తమ లీగల్ టీమ్ బెంగళూరు వెళ్లిన విషయం కర్ణాటక అధికారుల ద్వారా లీక్ కావడంతో, కేసీఆర్ జాగ్రత్త పడ్డారని, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హడావుడిగా రోహిత్ రెడ్డిని జడ్జి ఎదుటకు పంపి వాంగ్మూలం నమోదు చేయించారని బండి సంజయ్ ఆరోపించారు. రోహిత్ రెడ్డి ఎక్కడ వాస్తవాలు బయటపెడతాడోనని కేసీఆర్ భయపడ్డారని విమర్శించారు. కరీంనగర్ జిల్లా పోడూరులో మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay
Rohit Reddy
Drugs Case
Bengaluru
KCR
BJP
TRS
Telangana

More Telugu News