రేపు సీబీఐ విచారణను ఎదుర్కోనున్న కవిత
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత
- రేపు విచారణకు అందుబాటులో ఉంటానన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ
- తొలుత ఆమెను ఒక సాక్షిగా విచారించనున్న సీబీఐ
దీనిపై సీబీఐ డీఐజీ మంగళవారం కవితకు మెయిల్ పంపించారు. మీరు పేర్కొన్న తేదీలను పరిగణనలోకి తీసుకున్నామని... ఈ నెల 11న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని మీ నివాసానికి సీబీఐ బృందం వస్తుందని... ఆ సమయంలో విచారణకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. దీనికి సమాధానంగా కవిత మెయిల్ ద్వారా స్పందించారు. 11వ తేదీ ఉదయం తన నివాసంలో తాను అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో, కవితను రేపు సీబీఐ విచారించనుంది.
సీబీఐ కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు పంపింది. అంటే ఈ స్కామ్ కు సంబంధించి ఆమెను తొలుత ఒక సాక్షిగా విచారిస్తారు. ఆ తర్వాత విచారణలో తేలే విషయాలను బట్టి ఆమెను కేసులో ముద్దాయిగా చేర్చవచ్చు.