షర్మిలను అరెస్ట్ చేయడం బాధాకరం: సజ్జల రామకృష్ణారెడ్డి
- షర్మిలను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
- వ్యక్తిగతంగా షర్మిల అరెస్ట్ బాధాకరమన్న సజ్జల
- షర్మిల పార్టీ తెలంగాణలోనే ఉందని వ్యాఖ్య
- వైఎస్సార్టీపీ రాజకీయ నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని వెల్లడి
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెగా, సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరిగా ఉన్న షర్మిలను ఈ తరహాలో అరెస్ట్ చేయడం బాధ కలిగించే అంశమేనని సజ్జల అన్నారు. వ్యక్తిగతంగా షర్మిల అరెస్ట్ తమకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. షర్మిల అరెస్ట్ ను ఆయన దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు.
షర్మిల అరెస్ట్ పై మీ స్పందన ఏమిటన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. తమది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్న సజ్జల... షర్మిలది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని తెలిపారు. షర్మిల పార్టీ తెలంగాణలో ఉందని పేర్కొన్నారు. షర్మిల రాజకీయ నిర్ణయాల్లో మాత్రం జోక్యం చేసుకోమని కూడా సజ్జల తేల్చి చెప్పారు.