మల్లారెడ్డిపై ఐటీ దాడులు.. ఎంత నగదు, బంగారాన్ని సీజ్ చేశారంటే..!
- రూ. 18.5 కోట్ల నగదు, 15 కేజీల బంగారం స్వాధీనం
- మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారుల నోటీసులు
- సోమవారం నుంచి విచారణకు హాజరు కావాలని ఆదేశం
ఇంకోవైపు ఈ దాడులపై మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకే తమపై దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. ఇది రాజకీయ కక్షపూరితమైన చర్య అని అన్నారు. వందల మంది అధికారులతో సోదాలు నిర్వహించారని... ఇలాంటి దాడులను తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఐటీ దాడులతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆరే తన ధైర్యం అని చెప్పారు. ఐటీ విచారణకు సహకరిస్తానని తెలిపారు.