తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారు.. ఏపీలో రాజకీయ పార్టీని పెడతాం: పీఠాధిపతులు
- రాజకీయ నాయకులు, ధనవంతులకు మాత్రమే స్వేచ్ఛగా దర్శనం కలుగుతోందని ఆగ్రహం
- 900 మంది పీఠాధిపతుల ఆశీర్వాదంతో పార్టీని పెడతామని వ్యాఖ్య
- టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెల్లడిస్తామన్న పీఠాధిపతులు
అనంతరం శ్రీనివాసం మంగాపురంలో వారు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడకు చెందిన శ్రీయోగిపీఠం అధిపతి శ్రీయోగి అతిథేశ్వరానంద పర్వతస్వామి మాట్లాడుతూ... తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారని విమర్శించారు. తిరుమలలో కేవలం రాజకీయ నాయకులకు, ధనవంతులకు మాత్రమే శ్రీవారిని స్వేచ్ఛగా దర్శించుకునే అవకాశం కలుగుతోందని అన్నారు. సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
తిరుమలలో మార్పులు రాకపోతే అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దింపుతామని... దేశ వ్యాప్తంగా ఉన్న 900 మంది పీఠాధిపతుల ఆశీర్వాదంతో త్వరలోనే ఏపీలో కొత్త పార్టీని స్థాపిస్తామని అన్నారు. త్వరలోనే తిరుపతిలో బహిరంగసభను పెడతామని... టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెల్లడిస్తామని చెప్పారు.