నేపాల్లో మాయమై.. బీహార్లో ప్రత్యక్షమైన అరుదైన వైట్ రంప్డ్ రాబందు
- ఆహారం లేక బక్కచిక్కిన స్థితిలో కనిపించిన రాబందు
- అంతరించిపోయే ముప్పున్న జాతుల జాబితాలో వైట్ రంప్డ్ రాబందు
- రాబందుకు ఆహారం అందించి సపర్యలు చేసిన అధికారులు
భారత ఉప ఖండంలో ఒకప్పుడు విరివిగా కనిపించే ఈ రాబందులు మానవ ఆవాసాలకు దగ్గరగా కనిపించేవి. అయితే, ఆ తర్వాత క్రమంగా వీటి సంఖ్య తగ్గుముఖం పట్టడంతో 2000 సంవత్సరంలో వీటిని అంతరించిపోయే ముప్పు ఉన్న జాతుల జాబితాలో చేర్చారు. ఈ వైట్ రంప్డ్ రాబందుల సంరక్షణ కోసం చేపడుతున్న చర్యలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తున్నాయో తెలుసుకునేందుకు ఈ రాబందుకు రేడియో ట్యాగ్ కట్టి దాని ద్వారా ఆ పక్షి కదలికలను పర్యవేక్షిస్తున్నారు.
అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దానికి అమర్చిన రేడియో ట్యాగ్ నుంచి సమాచారం అందకపోవడంతో అధికారులు ఆందోళన చెందారు. సెప్టెంబరు 3న అది చివరిసారిగా నేపాల్లోని తనాహు జిల్లాలో కనిపించింది. ఇప్పుడు దీనిని బీహార్లోని బర్డ్ రింగింగ్ స్టేషన్ వద్ద అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఆహారం లేక బక్కచిక్కిపోవడంతో తక్షణం ఆహారం అందించి సపర్యలు చేశారు. ప్రస్తుతం ఈ రాబందును పర్యవేక్షణలో ఉంచామని, తేరుకున్నాక వదిలిపెడతామని పేర్కొన్నారు.