మడ అడవుల్లో జీ20 దేశాధినేతలు... వీడియో ఇదిగో!
- బాలిలో 13 వందల ఎకరాల్లో మడ అడవులు
- ఇండోనేషియా ప్రభుత్వమే పెంచుతున్న వైనం
- ఆ అడవుల్లోనే జీ20 దేశాల అధినేతల పర్యటన
- సెంటరాఫ్ అట్రాక్షన్ గా భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఇండోనేషియాలోని బాలిలో ఆ దేశ ప్రభుత్వం 13 వందల ఎకరాల విస్తీర్ణంలో మడ అడవులను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ అడవులను సందర్శించేందుకు జీ20 దేశాల అధినేతలు తరలి వెళ్లారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ లతో పాటు సదస్సుకు హాజరైన అన్ని దేశాల అధినేతలు ఈ పర్యటనలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా అందరూ సాదాసీదాగా రాగా.... మోదీ ఒక్కరు మాత్రమే తన అధికారిక సూట్ లో ఈ పర్యటనలో పాల్గొనడం గమనార్హం. ఫలితంగా ఈ పర్యటనలో మోదీ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ సందర్భంగా జీ20 దేశాల అధినేతలు అక్కడ ఒక్కో మొక్కను నాటారు.