వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా: ట్రంప్ కీలక ప్రకటన
- 2024 ఎన్నికల కోసం పత్రాలు సమర్పించిన ట్రంప్
- అమెరికా కేమ్ బ్యాక్ మళ్లీ మొదలైందన్న మాజీ అధ్యక్షుడు
- ట్రంప్‌కు ప్రజల్లో ఇప్పటికీ మంచి పాప్యులారిటీ
2016 అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన ట్రంప్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. యూఎస్‌కు మరోమారు అధ్యక్షుడు కావాలని తలపోసినా గత ఎన్నికల్లో అది సాధ్యం కాలేదు. దీంతో వచ్చే ఎన్నికలపై దృష్టి సారించారు. ఆయనకు ఇప్పటికీ ప్రజల్లో మంచి పాప్యులారిటీ ఉంది. వైట్‌హౌస్‌కు మళ్లీ రావాలన్న తన ఆకాంక్షను ట్రంప్ పలుమార్లు బహిరంగంగానే బయటపెట్టారు. దేశ చరిత్రలో ఈ రోజు అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఒకటిగా మారుతుందని ఆశిస్తున్నట్టు ట్రంప్ తన ‘ట్రూత్’ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.