Super Star: హీరో కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది: కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు

Doctors bulletin on Krishna Health condition
షార్ట్స్‌లో చూడండి
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రాత్రి 2 గంటల సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న కృష్ణను ఆసుపత్రికి తీసుకొచ్చారని మీడియాకు వారు వివరించారు. కార్డియాక్ అరెస్ట్ పరిస్థితి ఉండటంతో ఆయనను వెంటనే ఎమర్జెన్సీకి తరలించామని చెప్పారు. 20 నిమిషాల పాటు సీపీఆర్ అందించిన తర్వాత ఆయన కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చారని తెలిపారు. 

ఆ తర్వాత ఐసీయూకి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతూనే ఉందని... మరో 48 గంటల వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని అన్నారు. ఇకపై ప్రతి గంట కూడా కీలకమేనని చెప్పారు. ఆయన కోలుకోవాలని అందరం ప్రార్థిద్దామని అన్నారు. కృష్ణ శరీరం సహకరించే దాన్ని బట్టి చికిత్స ఉంటుందని తెలిపారు. రేపు మధ్యాహ్నం మరో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని చెప్పారు.
Go Back to Shorts
Super Star
Krishna
Health
Bulletin

More Telugu News