రూ.999కే చక్కని ఇయర్ బడ్స్.. బౌల్ట్ ఎక్స్30 విడుదల
- దీని ధర రూ.999
- బౌల్ట్ ఎక్స్50 విడుదల
- దీని ధర రూ.1,399
- అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పై లభ్యం
ఈ ఇయర్ బడ్స్ లో ప్రత్యేకంగా గేమింగ్ మోడ్ ఉంటుంది. వీటి డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంది. 40 గంటల పాటు పనిచేసే బ్యాటరీ వీటిల్లో ఉంది. ఎన్విరాన్ మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో ఇవి వస్తాయి. కేవలం 10 నిమిషాల చార్జింగ్ తో 100 నిమిషాల పాటు పనిచేస్తాయి. 10 ఎంఎం డ్రైవర్లు వీటిల్లో ఉన్నాయి.
వీటిని బౌల్ట్ ఆడియో వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే, ఎక్స్ 30 బడ్స్ ను అమెజాన్, ఎక్స్50 బడ్స్ ను ఫ్లిప్ కార్ట్ పోర్టల్ పై కొనుగోలు చేసుకోవచ్చు. బ్లాక్, వైట్ రంగుల్లో లభిస్తాయి. ఎక్స్ 30 ధర రూ.999 కాగా, ఎక్స్ 50 ధర రూ.1,399.