Special Darshan: తిరుమల శ్రీవారి దర్శనం డిసెంబరు కోటా టికెట్లు రేపు విడుదల

TTD will release Drashan tcikets tomorrow
షార్ట్స్‌లో చూడండి
తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించి డిసెంబరు కోటా టికెట్లను టీటీడీ రేపు (నవంబరు 11) విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఈ టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. రూ.300 విలువ చేసే ఈ టికెట్లను వివిధ టైమ్ స్లాట్లలో కేటాయించనున్నారు. ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకుని వెబ్ సైట్ ద్వారా ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. 

అటు, తిరుమల కొండపై రద్దీ సాధారణంగా ఉండడంతో వెంకన్న దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 66,946 మంది దర్శించుకోగా, రూ.4.73 కోట్ల ఆదాయం లభించింది.
Go Back to Shorts
Special Darshan
TTD
Tirumala

More Telugu News