ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం...రెవెన్యూ లోటు కింద రూ.879 కోట్ల విడుదల
- రాష్ట్ర విభజనతో రెవెన్యూ లోటులో ఏపీ
- ఏపీ సహా 14 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు
- 14 రాష్ట్రాలకు రూ.7,183 కోట్లను విడుదల చేసిన కేంద్రం
- ఈ విడతతో ఏపీకి చేరిన రూ.7,032 కోట్ల రెవెన్యూ లోటు నిధులు
దేశవ్యాప్తంగా రెవెన్యూ లోటుతో 14 రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. వాటిలో ఏపీతో పాటు అసోం, మణిపూర్, కేరళ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీ కోసం మంగళవారం కేంద్రం రూ.7,183 కోట్లను విడుదల చేసింది. వీటిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ కు రూ.1,132 కోట్లు విడుదలయ్యాయి.